ఆడపిల్లల పెళ్లి చేయడానికి అద్భుతమైన పథకం.. ఈజీగా 31 లక్షలు పొందండిలా..
దిశ, వెబ్‌డెస్క్ : ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది నానుడి. అంటే పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, ఆ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటోంది.
దిశ, వెబ్‌డెస్క్ : ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేది నానుడి. అంటే పెళ్లి చేసినా, ఇల్లు కట్టినా, ఆ ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటోంది. ఇక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అంటే.. ఆ తల్లి దండ్రుల బాధ వర్ణనాతీతం, కట్నం ఇవ్వడానికి ఎలా డబ్బులు కూడ బెట్టాలి అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. కానీ ఆడపిల్లల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తున్నాయి. అంతే కాకుండా ఎల్‌ఐసీ ఎన్నో కొత్త కొత్త పాలసీలతో ప్రజలకు ఎంతో సహాయకారిగా ఉంటోది. అయితే ఈ క్రమంలోనే ఎల్‌ఐసీ ఆడపిల్లల కోసం కన్యాదాన్ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ వలన అనేక ప్రయోజనాలున్నాయి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ పాలసీ ఎంతో సహాయకారిగా ఉంటోంది.
కన్యాదాన్ పాలసీ అంటే..?
కన్యాదాన్ పాలసీని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ సంస్థ తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశ్యం.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఎలాంటి చింత లేకుండా తన కూతురుకు సరైన వరుడిని వెతికి పెళ్లి చేసే సమయానికి లక్షల రూపాయలను అందిస్తోంది. దీని వలన అమ్మాయిల తల్లిదండ్రులపై ఆర్థిక భారం ఎక్కువగా పడదు. అయితే ఈ పాలసీ ద్వారా లక్షల రూపాయలు పొందాలంటే ముందుగా దీంట్లో పెట్టుబడి పెట్టాలి. అది ఎలా అంటే ?.. కన్యాదాన్ పాలసీలో రోజుకి రూ.150 పెట్టుబడిగా పెడితే నెలకి రూ.4530 అవుతాయి. ఇలా మీరు 22 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్లు పూర్తయిన తర్వాత మీ చేతికి రూ.31 లక్షలు వస్తాయి. అయితే ఇలా అమ్మాయిల తల్లిదండ్రులు తన కూతురు పుట్టిన నుంచే ప్రతి నెల డబ్బులు జమచేస్తూ పోతే తన కూతురుకు పెళ్లి వయసు వచ్చే సరికి ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు. మరీ ఇంకెందుకు లేటు త్వరగా కన్యాదాన్ పాలసీలో చేరిపోండి. మీ కూతురు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి.
అర్హతలు
- 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో వున్నవారు దీనికి అర్హులు.
- పాలసీ తీసుకునే సమయానికి పాలసీదారు కూతురి వయసు కనీసం ఏడాది ఉండాలి
పాలసీకి కావాల్సిన డాక్యూమెంట్స్
- ఆధార్ కార్డు,
- ఐడెంటిటీ కార్డు
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- అడ్రస్ ప్రూఫ్
- ఇన్‌కమ్ ప్రూఫ్
- పాలసీదారు కూతురి బర్త్ సర్టిఫికేట్
అదనపు సమాచారం
- కన్యాదాన్ పాలసీలో చేరి డబ్చులు కట్టేవారికి, ఈ ప్లాన్ 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. కానీ, ప్రీమియాలు 22 ఏళ్లే చెల్లించాలి.
- ఒకవేళ ఏదైనా అనుకోని సంఘటన వలన పాలసీదారుడు చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు వస్తాయి.
- యాక్సిడెంట్ అయితే కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారు.
- ఇక ఈ పాలసీ తీసుకోవాలి అనుకునేవారు, దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసును లేదా ఎల్ఐసీ ఏజెంట్ ద్వారా తీసుకోచ్చు.