‘మట్కా’ నుంచి ‘లే లే రాజా’.. గ్లామరస్ లుక్‌తో చంపేస్తున్న నోరా ఫతేహీ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ సినిమా ‘మట్కా’ (Matka).
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ సినిమా ‘మట్కా’ (Matka). కరణ్ కుమార్ (Karan Kumar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్, ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ (Varun Tej) సినీ కెరీర్‌లోనే అత్యంత హై బడ్జెట్‌గా రూపొందుతున్న ఈ సినిమా.. 1958-1982 మధ్య కాలంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇందులో నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో.. వరుస అప్‌డేట్స్ (Updates)తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘మట్కా’ (Matka) నుంచి ‘లే లే రాజా’ (Le Le Raja) సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇది క్లబ్ సాంగ్ అని అర్థం అవుతుండగా.. ఇందులో నోరా ఫతేహీ (Nora Fatehi) తన గ్లామరస్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రెట్రో సెట్టింగ్‌లో రూపొందించిన ఈ పాట సంగీతం, గానం, లిరిక్స్ అన్నీ కూడా 70, 80ల కాలం వైభవాన్ని గుర్తు చేసే విధంగా ఉన్నాయి. ప్రజెంట్ ఈ సాంగ్ నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.