ఏప్రిల్ 6 నుంచి లాసెట్ దరఖాస్తులు
దిశ, తెలంగాణ బ్యూరో: లా సెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ - Lawcet applications will be accepted online from April 6
దిశ, తెలంగాణ బ్యూరో: లా సెట్, పీజీఎల్ సెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. లాసెట్ దరఖాస్తులకు గాను ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500 ఫీజు ఉండగా, జనరల్ అభ్యర్థులకు రూ.800 గా నిర్ణయించారు. పీజీఎల్ సెట్‌కు జనరల్ అభ్యర్థులకు రూ.1000 ఉంటే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.800 గా నిర్ణయించారు. ఇదిలా ఉండగా జూన్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రూ.500 ఆలస్య రుసుముతో జూన్ 6వ తేదీ వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో జూలై 5వ తేదీ వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో జూలై 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులో తప్పొప్పుల సవరణకు జూలై 5 నుంచి 12వ తేదీ వరకు అధికారులు అవకాశం కల్పించారు. మూడేళ్ల లాసెట్కోర్సు ప్రవేశ పరీక్షను జూలై 21వ తేదీన, ఐదేళ్ల లాసెట్, పీజీఎల్సెట్కోర్సు ప్రవేశాలకు జూలై 22వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.