అత్తవు కావు.. అమ్మవు నీవు.. నుదుటిపై చివరి ముద్దిచ్చి వీడ్కోలు పలికిన కోడలు
దిశ, తుంగతుర్తి: ఆ లాలన.. ఆ పాలన.. ఆ ప్రేమ.. ఆ ఆప్యాయత.. ఆ అనురాగాలు - latest news about mallu swarjayam
దిశ, తుంగతుర్తి: ఆ లాలన.. ఆ పాలన.. ఆ ప్రేమ.. ఆ ఆప్యాయత.. ఆ అనురాగాలు ఇక చూడలేను అమ్మ.. అత్తవైన.. అమ్మవైన నీ ఉద్యమ వారసత్వాన్ని తునికి పుచ్చుకున్నాను.. అంటూ చివరిసారిగా చిన్న కోడలు మల్లు లక్ష్మి.. స్వరాజ్యం నుదుటిని రోదిస్తూ ప్రేమగా ముద్దాడింది. నల్లగొండ జిల్లా కేంద్రానికి వచ్చిన స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రజల సందర్శన అనంతరం మెడికల్ కళాశాలకు అప్పజెప్పే ముందు జరిగిన ఈ హృదయ విదారక దృశ్యం అందరిని ఆకట్టుకోవడమే కాకుండా కంటతడి పెట్టించింది. అమ్మ.. నీవు వెళ్ళిపోతున్నావా..! అత్తమ్మ కావు.. నువ్వు అమ్మవు.. అంటూ కోడలు లక్ష్మి చివరిగా వీడ్కోలు పలికింది.