Snapchat: సరికొత్త ఫీచర్‌తో అట్రాక్ట్ చేస్తున్న 'స్నాప్ చాట్'.. క్షణంలో వెరిఫైడ్ న్యూస్
దిశ, ఫీచర్స్: స్నాప్ చాట్ సరికొత్త అప్‌డేట్‌తో వచ్చేసింది. న్యూ ఫీచర్స్‌తో యూజర్స్‌ను..latest feature in SnapChat App
దిశ, ఫీచర్స్: స్నాప్ చాట్ సరికొత్త అప్‌డేట్‌తో వచ్చేసింది. న్యూ ఫీచర్స్‌తో యూజర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ప్లాట్‌ఫామ్.. 'డైనమిక్ స్టోరీస్'ను ప్రకటించింది. తద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే న్యూస్ అప్‌డేట్స్ అందివ్వనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాప్‌లోని వినియోగదారులకు స్థానిక సమాచారం, న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు అందించేందుకు 'డైనమిక్ స్టోరీస్' ఫీచర్ పరిచయం చేసినట్లు కంపెనీ పేర్కొంది. అయితే సోషల్ మీడియాలో ఏదీ సరైన వార్తో, ఏదీ కాదో తెలుసుకోవడం కష్టంగా మారిపోయింది. ఫేక్‌న్యూస్ ఎక్కువైన నేపథ్యంలో వెరిఫై చేసిన మీడియా పబ్లిషర్స్ సృష్టించిన కంటెంట్ ద్వారానే వార్తా కథనాల అప్‌డేట్స్ అందుతాయని స్పష్టం చేసింది. ఇందుకోసం CNN, బ్లూమ్‌బెర్గ్, ESPN, ఇన్‌సైడర్, న్యూయార్క్ పోస్ట్, పేజ్ సిక్స్, సెల్ఫ్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్, TMZ, వోగ్ వంటి పాపులర్ న్యూస్ ఏజెన్సీలను ఎంచుకుంది. ఇక ఈ ఫీచర్‌ను ఫ్రాన్స్, యూఎస్, యూకే వంటి ఇతర ప్రాంతాలతో పాటు భారతదేశంలోనూ పరీక్షిస్తున్న స్నాప్‌చాట్ త్వరలోనే మరిన్ని దేశాల్లోనూ ఇంట్రడ్యూస్ చేయనుంది.
భారతదేశంలో డైనమిక్ స్టోరీస్ కథనాలను స్వీకరించేందుకు GQ India, MissMalini, Pinkvilla, Sportskeeda, The Quint, Times Now, Vogue India వంటి పబ్లిషర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న స్నాప్ చాట్.. ప్రస్తుతం ఈ కథనాలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. త్వరలోనే స్థానిక భాషలను జోడించే పనిలో ఉన్నట్లు నివేదించింది.