Bumper Offer: రీల్ పెట్టు కాస్ట్లీ బహుమతి పట్టు (పోస్ట్)

ఇటీవల కాలంలో మేకర్స్ సినీ ప్రియులను ఆకట్టుకోవడం కోసం ప్రమోషన్స్ వెరైటీగా చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

Update: 2024-10-09 13:24 GMT

దిశ, సినిమా: ఇటీవల కాలంలో మేకర్స్ సినీ ప్రియులను ఆకట్టుకోవడం కోసం ప్రమోషన్స్ వెరైటీగా చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. అంతేకాకుండా ట్రెండ్‌కి తగ్గట్లు ప్రమోషన్స్ ప్లాన్ చేసి తమ మూవీని ఆడియన్స్‌కు ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. తాజాగా, ‘లగ్గం’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ‘‘లగ్గం(Laggam) సినిమాలోని ఏదైనా పాటకు రీల్ చేసి మీ ఇన్‌స్టా(Instagram), యూట్యూబ్ షాట్స్‌గా మీ అకౌంట్‌లో షేర్ చేసి లింక్ మా వాట్సాప్ 8885050729 నంబర్‌కు పంపి కాస్ట్లీ చీరను బహుమతిగా పొందగలరు’’ అని రాసుకొచ్చారు. దీనిని రీల్ పెట్టు చీర పట్టు అని పోస్ట్‌లో పెట్టారు.

అయితే ఇందులో సాయి రోనక్ (Sai Ronak), ప్రగ్యా నగ్రా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లగ్గం’. దీనిని రమేశ్ దర్శకత్వం వహించగా..సుబిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ‘లగ్గం’(Laggam) చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా అక్టోబర్ 25న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే దసరా (Dussehra)రావడంతో మేకర్స్ చీర బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈవిషయం తెలుసుకున్న మహిళలు రీల్స్ చేసి లగ్గం మూవీ మేకర్స్‌కు షేర్ చేస్తున్నారు.

 

Tags:    

Similar News