'17 ఏళ్లకే లైంగిక దాడి.. ఇంట్లో కూడా సురక్షితంగా ఉండలేకపోయా'
దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ కుబ్రా సైత్.. యుక్తవయసులో లైంగిక వేధింపులకు గురైన బాధను ఎలా అధిగమించిందో వివరించింది..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ కుబ్రా సైత్.. యుక్తవయసులో లైంగిక వేధింపులకు గురైన బాధను ఎలా అధిగమించిందో వివరించింది. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలో స్వతంత్ర భావాలు కలిగిఉన్నట్లు తెలిపిన కుబ్రా.. ఈ కారణంగా విజయాలు సాధించేందుకు లైఫ్‌లో ఎన్నో కష్టాలుపడ్డట్లు చెప్పింది. ఇక 17 ఏళ్లకే తన తల్లి బాయ్‌ఫ్రెండ్ చేతిలో కన్యత్వం కొల్పోయానని, ఫలితంగా కొంత కాలంపాటు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు వెల్లడించింది.
అంతేకాదు జీవితమెప్పుడూ మనం కోరుకున్నంత పరిపూర్ణంగా ఉండదన్న నటి.. మహిళలు సురక్షితంగా భావించేది ఇంటినే, కానీ తాను అక్కడ కూడా స్వేచ్ఛ పొందలేకపోయానని వాపోయింది. ఇక తను రాసిన 'ఓపెన్ బుక్ : నాట్ ఎనఫ్ ఎ మెమొయిర్' పుస్తకంలో సంచలన విషయాలు బయటపెట్టిన కుబ్రా.. బెంగుళూరులో పుట్టి నార్త్ ఇండియాలో ఉంటునప్పటికీ దక్షిణ భారతదేశానికి చెందిన మహిళగానే గర్వంగా ఫీల్ అవుతానని చెప్పడం విశేషం.