KTR: హోం మంత్రి అమిత్‌షా పై ట్విట్టర్‌లో మండిపడ్డ కేటీఆర్
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంపై నిత్యం ఏదో విధంగా విమర్శలు చేస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా, హోం మంత్రి అమిత్
దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంపై నిత్యం ఏదో విధంగా విమర్శలు చేస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా, హోం మంత్రి అమిత్ షాపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. శుక్రవారం అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తెలుపుతూ ప్రశ్నల వర్షం కురిపించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు హిందీలో మాత్రమే మాట్లాడాలని, ఇంగ్లీష్‌లో మాట్లాడకూడదని పిలుపునిచ్చారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. భారతదేశం ఓ వసుధైక కుటుంబమని, భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని, అలాంటిది దేశంలోని ప్రజలు ఏమి తినాలో, ఏమి ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయాలకే వదిలేయాలని అని సూచించారు. తాను మొదట భారతీయుడినని, అందులోనూ గర్వించదగ్గ తెలుగువాడిని, తెలంగాణ వాడినని, తన మాతృ భాష తెలుగు అని ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దులోనూ మాట్లాడగలను అని చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్‌ను నిషేధిస్తే దేశంలోని యువకులకు మరింత నష్టం కలుగుతుందని చెప్పారు.