నేను మహిళను కాదు.. జెండర్ ఈక్వాలిటీపై హీరోయిన్ ఇన్‌ట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: బీ టౌన్ యాక్ట్రెస్ కొంకణా సేన్ శర్మ జెండర్ ఈక్వాలిటీ గురించి..telugu latest news
దిశ, సినిమా: బీ టౌన్ యాక్ట్రెస్ కొంకణా సేన్ శర్మ జెండర్ ఈక్వాలిటీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫెమినిజంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'ఏ సినిమాలోనైనా స్త్రీవాది పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి వస్తుంది. దీన్ని బట్టి పురుషులు కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంటారు. కాబట్టి స్త్రీ, పురుషుల మధ్య లింగ బేధమే తప్ప ఆలోచనల్లో పెద్దగా మార్పులుండవని భావిస్తున్నాను. అందుకే ఇద్దరికీ సమానంగా గౌరవం, న్యాయం దక్కాలని కోరుకుంటున్నాను' అని తెలిపింది. అలాగే తన విషయానికొస్తే తనను తాను మహిళగా ఎప్పుడూ భావించుకోలేదన్న కొంకణా.. ఇతరుల కోసం అన్నింటిని భరిస్తూ బాధపడటం తన వల్ల కాదని, ఎవరి అనుమతి లేకుండా నచ్చిన పనులు చేసుకునే ఫ్రీడమ్ కావాలంటోంది.