Komatireddy Venkat Reddy: ఆ విషయంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది

Komatireddy Venkat Reddy Says, KCR Government Failed to Extend Flood Aid| ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అల్లకల్లోలం సృష్టించిన గోదావరి వరద నష్టంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం లోక్ సభలో ప్రస్తావించారు. 377 నిబంధన కింద తెలంగాణలో జరిగిన వరద నష్టానికి పరిహారం

Update: 2022-08-05 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: Komatireddy Venkat Reddy Says, KCR Government Failed to Extend Flood Aid| ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అల్లకల్లోలం సృష్టించిన గోదావరి వరద నష్టంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం లోక్ సభలో ప్రస్తావించారు. 377 నిబంధన కింద తెలంగాణలో జరిగిన వరద నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వరదలతో లక్షలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు నిరాశ్రయులయ్యారని, వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1400 కోట్ల ప్రతిపాదనలు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పంపిందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. వరదల కారణంగా రోడ్లు, భవనాలు రూ.498 కోట్లు, నీటి పారుదల రూ.33 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రూ.379 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.7 కోట్లు, పంచాయితీ రాజ్ కు రూ.449 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వరదలు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే సహాయక చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు. మరోవైపు ఇవాళ హోం మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి భేటీ కాబోతున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైనందున వెంటనే కేంద్ర హోం శాఖ స్పందించి తక్షణం 100 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తానన్నారు.

ఇది కూడా చదవండి: రాజగోపాల్ రెడ్డి బాగోతం బయటపెట్టిన MLC పల్లా..

Tags:    

Similar News