మునుగోడు బై పోల్స్‌లో ఎవరు గెలుస్తారో నాకు తెలుసు: Komatireddy Venkat Reddy
Komatireddy Venkat Reddy Comments On Munugode By poll| మునుగోడు ఉపఎన్నికలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలుసని, ఇప్పుడు తాను ఎలాంటి విషయాలు చెప్పనన్నారు. ఎవరు గెలుస్తారో మీరే చెప్పాలని మీడియా
దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తనను సంప్రదించకుండానే చండూరులో సభను ఏర్పాటు చేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారే విషయంలో అనవసరమైన పుకార్లు సృష్టించవద్దని, ఒక వేళ పార్టీ మారాలని భావిస్తే ముందుగా ప్రకటించే పార్టీ మారుతానన్నారు. తనకు పార్లమెంట్ లో ఇవాళ ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నాయని తెలిసికూడా తన అనుమతి లేకుండానే తన పార్లమెంట్ పరిధిలో మీటింగ్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. తాను పదవుల వెంటపడే వ్యక్తిని కాదని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో శుక్రవారం భేటీ అయిన వెంకట్ రెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వరద కష్టాలపై అమిత్ షాతో మాట్లాడినట్లు చెప్పారు. వర్షాల వల్ల 1,400 కోట్లు నష్టం జరిగిందని, రాష్ట్రంలో ఏరియల్ సర్వే చేయాలని కోరినట్లు తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన కుమారుడు చనిపోయిన దుఃఖంలో ఉంటూనే.. మంత్రి పదవిని త్యాగం చేశానని అన్నారు.
హుజురాబాద్ లో ఒకలా.. మునుగోడులో మరొకలా
గతలో హుజురాబాద్ ఉప ఎన్నిక టైమ్ లో ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత నోటిఫికేషన్ వెలువడిన తర్వాత చాలా రోజులు గడిచినా కూడా అక్కడ పార్టీ అభ్యర్థి విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కసరత్తు చేయలేదని మండిపడ్డారు. అందుకు బదులుగా ఇంద్రవెల్లి, రావిరాల, మహబూబ్ నగర్, గజ్వేల్ ల్లో సభలు నిర్వహించారే తప్పా.. అక్కడ పార్టీ అభ్యర్థి ఎవరు ఉంటే బాగుంటుందనే దానిపై కార్యకర్తలతో సమావేశం కాలేదని అన్నారు. మునుగోడులో మాత్రం రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పీకర్ ను కలవనేలేదు, రాజీనామా ఆమోదించబడకముందే రేవంత్ రెడ్డి అక్కడ కార్యకర్తల భేటీ పేరుతో హడావుడి చేస్తున్నారని అన్నారు. ఇవాళ పార్లమెంట్ లో తన ప్రశ్నలు అడాగాల్సి ఉందని, ఈ నేపథ్యంలో తాను చండూరు సభకు ఎలాగూ రాలేనని తెలుసుకుని భవిష్యత్ లో తనను పార్టీ వ్యతిరేకి అని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే తన ఓటమి కోసం పని చేసిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఆ వ్యక్తితో తాను చండూరు సభలో పాల్గొనమంటారా? అని ప్రశ్నించారు. తనను సంప్రదించకుండానే తన వ్యతిరేకులను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, తన పార్లమెంట్ పరిధిలో మీటింగ్ ఏర్పాటు చేసి తమను మానసికంగా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 3 ఏళ్ల కిందట పార్టీలోకి వచ్చిన వారికి టీపీసీసీ ఇచ్చి 34 ఏళ్ల నుండి పార్టీకి పని చేస్తున్న వ్యక్తికి స్టార్ క్యాంపెయినర్లా? అని ప్రశ్నించారు. దాసోజ్ శ్రవణ్ లాంటి వ్యక్తులు పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారంటే.. దానికి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. మునుగోడులో ఎవరు గెలుస్తారో తనకు తెలుసని, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
నేను ధర్నా చేస్తుంటే ఆ ఇద్దరు ఇంట్లో ఉన్నారు
ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్నారా? అనే ప్రశ్నకు తాను రాష్ట్ర సమస్యలపై ముఖ్యమైన మీటింగ్ కు హాజరయ్యానని వెంకట్ రెడ్డి అన్నారు. కోల్ టెండర్లలో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున లాస్ జరగుండా తాను అడ్డుకోగలిగానని అందుకు తనకు బెస్ట్ ఎంపీ అవార్డు ఇవ్వాలని అన్నారు. యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని క్లోజ్ చేసిన సందర్భంలో తాను మాత్రం రాత్రి 10 గంటల వరకు ధర్నాలో ఉంటే తెలంగాణకు చెందిన మిగిలిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ఇంట్లో ఉన్నారని అన్నారు. చండూరులో సభ కంటే రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఆ విషయంలో టీఆర్ఎస్ పూర్తిగా విఫలమైంది