Bhatti Vikramarka: భట్టి విక్రమార్క సంచలన నిర్ణయం.. 15వ తేదీన ముహూర్తం ఖరారు

Komatireddy Rajagopal Reddy will Have to Regret, Says Bhatti Vikramarka| రాష్ట్రంలో అతి త్వరలోనే పాదయాత్ర చేస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ బాధపడటం ఖాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు

Update: 2022-08-08 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: Komatireddy Rajagopal Reddy will Have to Regret, Says Bhatti Vikramarka| రాష్ట్రంలో అతి త్వరలోనే పాదయాత్ర చేస్తానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారినందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ బాధపడటం ఖాయమని వ్యాఖ్యానించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై మళ్లీ గెలిచేది కాంగ్రెస్ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో చోటు చేసుకొన్న పరిస్థితులను తెలుసుకొనేందుకు గాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నామని చెప్పారు. ఈ నెల 16 నుండి భద్రాచలం నుండి వరద ప్రభావిత ప్రాంతాల నుండి పర్యటనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయా జల్లాల్లోని ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామని అన్నారు. చాలా ప్రాజెక్టులు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదని గుర్తు చేశారు.

కాళేశ్వరం, కడెం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణ తీరును కూడా సీఎల్పీ బృందం పరిశీలించనుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 కి.మీ పాటు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 75 మంది నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొనాలని ప్లాన్ చేశామన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న నేతలను సన్మానిస్తూ ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా భట్టి విక్రమార్క వివరించారు.

ఇది కూడా చదవండి: ఈడీ కేసీఆర్ ఇంటి తలుపు తట్టడం ఎంతో దూరంలో లేదు

Tags:    

Similar News