Kiran Abbavaram: ఆఫర్ ప్రకటిస్తూ కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్..!!
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఎమోషనల్ కామెంట్లు చేశారు. అంజన్ రామచంద్ర అండ్ శ్రావణి రెడ్డి కలయికలో తెరకెక్కుతోన్న లవ్ రెడ్డి చిత్రం రేపు (అక్టోబరు 18) థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. అయితే హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. తన షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన రోజులను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు. కిరణ్ అబ్బవరం కూడా షార్ట్ ఫిలిమ్స్ లో నటించి.. హీరోగా పాన్ ఇండియా సినిమాలు తీసే రేంజ్‌కు ఎదిగాడు. కాగా లవ్ రెడ్డి చిత్రాన్ని అందరూ వీక్షించండి అని, ఈ చిన్న మూవీకి తను సపోర్ట్ గా ఉంటానని అన్నాడు. ఇదే ప్రసాద్ ల్యాబ్ లో మా షార్ట్ ఫిలిమ్స్ చూసుకున్నామని అన్నారు.
అంజన్, కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిలిమ్స్ నుంచే మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉందని వెల్లడించాడు. తనలాగే అంజన్ కూడా గట్టిగా నిలబడి నేడు హీరోగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడని, చిన్న సినిమాలు అంటే వరద బాధితుల వంటి వారని.. కాగా జనాలే బాగా సపోర్ట్ చేయాలని కోరాడు. లవ్ రెడ్డి మూవీ కోసం అంజన్ కుటుంబం మొత్తం నిలబడిందని, నేను చూసినంతవరకు అయితే ఈ మూవీ చాలా బాగుందని తెలిపాడు. అంతేకాకుండా ఈ మూవీకి ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో కిరణ్ అబ్బవరం స్పాన్సర్ చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. తన వల్ల అయినంత సహాయం చేస్తానని తెలిపాడు. దీంతో మన టాలీవుడ్ హీరోపై అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.