కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ అవార్డు

దిశ, అచ్చంపేట: నల్లమల్ల ప్రాంతానికి చెందిన - Kinnera Mogulayya receiving the Padma Shri at the hands of the President

Update: 2022-03-21 14:30 GMT

దిశ, అచ్చంపేట: నల్లమల ప్రాంతంలోని నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల పరిధిలోని అవసలి కుంట గ్రామానికి చెందిన 12 కిన్నెరమెట్ల దర్శనం మొగులయ్య సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మొగులయ్య ను ప్రశంసిస్తూ.. తాను పాడిన పాట సాహిత్యం చాలా బాగుందని కితాబు ఇచ్చారు.

మొగులయ్య భుజం తట్టిన ప్రధాని మోదీ..

మొగులయ్య పద్మశ్రీ అవార్డు అందుకునే ముందు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అమిత్ షా లు మొగిలయ్యను భుజం తట్టి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మొగులయ్య ను ఢిల్లీలో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన వెంట అచ్చంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చందు నాయక్ ఉన్నారు.

అవార్డు వస్తుందని ఊహించలేదు..


తన పాటకు, సాహిత్యానికి ఇలాంటి గొప్ప అరుదైన అవార్డు వస్తదని ఏనాడూ ఊహించలేదని కిన్నెర మొగులయ్య తెలిపారు. మా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎం కేసీఆర్ సహకారంతోనే అవార్డు దక్కిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 12 మెట్ల కిన్నెర ను భావితరాలకు అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని కోరారు. ఈ సాహిత్యాన్ని నాతో అంతరించిపోకుండా భావితరాలకు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మొగిలయ్య తెలిపారు.

Tags:    

Similar News