రెండు కాళ్లూ లేని అదృష్ట వంతుడు.. ఇది కదా నిజమైన స్నేహమంటే
దిశ, ఫీచర్స్: అందరికీ అన్నీ ఉన్నా ఏమీ లేవు అని బాధపడుతూ ఉంటారు..latest telugu news
దిశ, ఫీచర్స్: అందరికీ అన్నీ ఉన్నా ఏమీ లేవు అని బాధపడుతూ ఉంటారు. సొంత ఇల్లు, కారు, డబ్బులు లగ్జరీ లైఫ్ ఉన్నా ఏదో కోల్పోయినట్టు ఉంటారు. ప్రశాంతంగా నవ్వలేరు , జీవించలేరు. ఏదో ఒక వెలితి.. అసంతృప్తి మిగిలే ఉంటుంది వీరి జీవితాల్లో. కానీ కొంతమంది అలా కాదు.. వారి లైఫ్‌లో ఏమీ లేకున్నా, కాళ్లు చేతులు లేకున్నా, కటిక పేదరికంలో ఉన్నా.. చాలా సంతోషంగా ఉంటారు. అనుక్షణం ఆనందంగా గడుపుతుంటారు. ఎందుకంటే.. కుటుంబ సభ్యుల ప్రేమ, బంధుమిత్రుల బలం, ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం ఇవే వారికి కొండంత ధైర్యం. ఇవి ఉంటే చాలు ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోగలం అనే నమ్మకం వారికి కలుగుతుంది.
అలాంటి అదృష్టం కేరళకు చెందిన ఓ యువకుడికి దక్కింది. రెండు కాళ్లు లేకున్నా.. ఆనందంగా జీవిస్తున్నాడు. తన స్నేహితులే తన రెండు కాళ్లుగా మారారు. వారి సాయంతో ప్రపంచాన్ని గెలిచేందుకు పరుగులు పెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొల్లాం జిల్లా, సస్తంకోటకు చెందిన ఆలిఫ్ మహమ్మద్ బీకామ్ చదువుతున్నాడు. పుట్టుకతోనే అతనికి రెండు కాళ్లూ లేవు. ఇదే క్రమంలో అతనికి ఇద్దరు మంచి మిత్రులు ఆర్య, అర్చన ఉన్నారు. వీరిద్దరి వల్ల ఆలిఫ్‌కు ఇప్పటి వరకు ఎలాంటి కష్టం రాలేదు. కాళ్లు లేవన్న బాధ ఎప్పుడు అతడిలో కలగలేదు. ఎందుకంటే ఆర్య, అర్చన.. వీళ్లే అతని కాళ్లు. వాళ్లే ఆలిఫ్‌ను కాలేజీకి తీసుకెళ్తారు.. ఇంటి తిరిగి చేర్చుతారు. ఎక్కడ ఉన్నా.. ఎప్పుడూ అండగా నిలుస్తారు. అసలు కాళ్లు లేని లోటు ఎప్పడూ తనకు కనిపించలేదు. ఆలిఫ్ మహమ్మద్‌ను ఆర్య, అర్చన ఎత్తుకొని తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.