Tollywood: ఇప్పుడెందుకు ఈ పరామర్శలు.. మీ సినిమా బిజినెస్ కోసం వస్తున్నారా అంటూ నటులపై మండిపడుతున్న సామాన్యులు

మీరు మాత్రం సినిమా సినిమాకి కోట్లు సంపాదిస్తున్నారు.. రైతులేమో పంటకి గిట్టు బాటు ధర కూడా లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు.

Update: 2024-12-24 12:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన " పుష్ప 2 " ( Pushpa 2) మూవీ. ఈ మూవీ రిలీజ్ టైం లో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవరకు మీకు ఆ బాలుడు గుర్తు రాలేదా? ఇప్పుడెందుకు ఈ పరామర్శలు .. ముందు ఎందుకు రాలేదు.. ఇప్పుడు మీ సినిమా బెనిఫిట్ షోస్ పర్మిషన్స్ కోసం వస్తున్నారా.. ఇక్కడ కూడా బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ? మీ సినిమా వాళ్ళకి మా సామాన్యులు అంటే ఎప్పుడూ చులకనే .. వాస్తవానికి మీ నటులు ఉండాల్సిన స్థానంలో రైతులు (Formers) ఉండాలి. మీరు తినే బియ్యాన్ని కూడా వాళ్ళు 24 గంటలు ఎండలో కష్ట పడి పండిస్తున్నారు. కానీ, రైతు బతుకు మాత్రం మారడం లేదు. మీరు మాత్రం సినిమా సినిమాకి కోట్లు సంపాదిస్తున్నారు.. రైతులేమో పంటకి గిట్టు బాటు ధర కూడా లేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. ఒక రైతు కి దక్కాల్సిన గౌరవం మీకు దక్కడం సిగ్గుచేటు అంటూ సామాన్యులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News