సొంత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించిన కేరళ.. దేశంలోనే ఫస్ట్ స్టేట్‌గా గుర్తింపు

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది కేరళ ప్రభుత్వం..Latest Telugu News

Update: 2022-07-15 08:07 GMT

దిశ, ఫీచర్స్ : ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది కేరళ ప్రభుత్వం. ఇండియాలోనే సొంత ఇంటర్నెట్ సేవలను కలిగిన ఏకైక రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అక్షరాస్యత, పరిపూర్ణమైన పంచాయితీ రాజ్ వ్యవస్థ, టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో ఎన్నో ఘనతలు సాధించిన కేరళ.. ప్రస్తుతం మరో విజయంతో ఒకడుగు ముందుకు వేసింది. ఈ ఘనతను కేరళ సీఎం పినరయి విజయన్ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఉండే డిజిటల్ సమస్యలను తొలగించేందుకు ఈ పథకం సహాయపడుతుందని అన్నారు. 'దేశంలో సొంత ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్న ఏకైక రాష్ట్రంగా కేరళ అవతరించిందని.. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ లిమిటెడ్‌కు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యునికేషన్ నుంచి ఐఎస్పీ లైసెన్స్ వచ్చిందని తెలిపారు. దాంతోపాటు కేఎఫ్‌ఓఎన్ ప్రాజెక్ట్ ప్రజలకు ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా అందించేలా కార్యకలాపాలు ప్రారంభిస్తుందన్నారు.  


Similar News