Keerthy Suresh: క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి.. రొమాంటిక్ పిక్స్ వైరల్
టాలీవుడ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh).. తన ప్రియులు అంటోనీ(Antony)తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh).. తన ప్రియుడు అంటోనీ(ntony)తో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టింది. వీరి వివాహం పెద్దల సమక్షంలో గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సన్నిహితులు మాత్రమే కీర్తి-అంటోనీ వివాహా వేడుకకు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కీర్తి సురేష్ సోషల్ మీడియాలో పంచుకోగా.. అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికి కూడా పెళ్లి ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. తాజాగా ఈ నటి మళ్లీ క్రిస్టియన్ పద్ధతిలో మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియుడికి కిస్ పెడుతోన్న, రింగ్ తొడుగుతోన్న, డ్యాన్స్ చేస్తోన్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.