మహిళా దినోత్సవం.. నెట్టింట టీఆర్ఎస్ ఫ్లెక్సీలు వైరల్!
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై.. Latest Telugu News..
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, రక్షణ కార్యక్రమాలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీ ఎత్తున ప్రచారం చేయాలని టీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో 'కేసీఆర్ మహిళా బంధు' పేరుతో రాష్ట్రమంతా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
అందుకు కారణం లేక పోలేదు. ఇంతకీ కారణం ఏంటంటే.. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో చాలా చోట్ల మహిళల ఫొటోలే లేవు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మహిళ ఫొటో లేకపోవడంతో.. "ధన్యవాదాలు.. మీక్కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు" అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.