భర్త ముందే మరో హీరోపై కన్నేసిన నటి.. గడ్డానికి పడిపోయానంటూ

దిశ, సినిమా : బాలీవుడ్‌ స్టార్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ విక్కీని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది..Latest Telugu News

Update: 2022-07-01 07:39 GMT

దిశ, సినిమా : బాలీవుడ్‌ స్టార్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్ విక్కీని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. తమకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరోను పొగిడేస్తూ భర్తతో జరిపిన సరదా సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది. విషయానికొస్తే.. హీరో హృతిక్ రోషన్‌ ఇటీవల గడ్డాన్ని హైలెట్ చేసే ఓ ప్రకటనలో నటించిన విషయం తెలిసిందే.

కాగా అతని న్యూ లుక్‌ అదిరిపోయిందని పొగిడేసిన కత్రిన.. 'గడ్డంలో హృతిక్ రోషన్ నచ్చాడు' అంటూ తన ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు ఈ పోస్టును విక్కీ కౌశల్‌కు ట్యాగ్ చేయడంతో వెంటనే స్పందించిన విక్కీ.. 'మనం కొద్దిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది' అంటూ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'కట్టుకున్నోడు ఉండగానే పక్కోడిమీద పడిందా నీ కన్ను' అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.  


Similar News