Kaleshwaram : ప్రారంభం అయిన కాళేశ్వరం కమిషన్ ఇంజనీర్ల బహిరంగ విచారణ
కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు అవినీతికి సంబంధించి జస్టీస్ పీసీ.ఘోష్(Justice PC Ghosh) కొనసాగిస్తున్న విచారణకు బుధవారం కమిషన్ ముందు18 మంది ఇంజనీర్లు హాజరయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : కాళేశ్వరం(Kaleshwaram) ప్రాజెక్టు అవినీతికి సంబంధించి జస్టీస్ పీసీ.ఘోష్(Justice PC Ghosh) కొనసాగిస్తున్న విచారణకు బుధవారం కమిషన్ ముందు18 మంది ఇంజనీర్లు హాజరయ్యారు. నిన్నటి వరకు 34 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించింది. కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ ఒక్కొక్కరిని బహిరంగంగా విచారిస్తున్నారు. నిన్న జరిగిన విచారణకు 16మంది ఇంజనీర్లు హాజరయ్యారు.
వారిలో కొందరు ప్రమాణం చేసిన తర్వాత కూడా తన ప్రశ్నలకు తప్పుడు సమాచారం ఇవ్వడం పట్ల జస్టీస్ ఘోష్ సీరియస్ అయ్యారు. అలా చేస్తే క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేస్తానని హెచ్చరించారు. ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం బ్లాకులు ఎందుకు కట్టలేదని నిలదీశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు దేశ వ్యాప్త సంచలనమైంది. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల ఇంజినీర్లను కమిషన్ విచారిస్తుంది.