న్యూఢిల్లీ: హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి మంగళవారం వరకు ప్రీ యూనివర్సిటీ విద్యార్థులకు క్లాసులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ తెలిపింది. అంతకుముందు, ఈ నెల 14న పాఠశాలలు తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై శాంతి భద్రతలకు ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కొంతమంది విద్యార్థులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరు కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. మరికొందరు హిజాబ్ ధరించడానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాగా అంతకుముందు సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించిన సంగతి తెలిసిందే.