సీఐఎస్ఎఫ్ బలగాలను పొగడ్తలతో ముంచెత్తిన అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో వివిధ కార్యకాలాపాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా..latest telugu news
న్యూఢిల్లీ: దేశంలో వివిధ కార్యకాలాపాల్లో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలు (సీఐఎస్ఎఫ్) పోషించిన పాత్రను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రశంసించారు. దేశానికి సీఐఎస్ఎఫ్ బలగాలు కర్మయోగి వంటివని పొగడ్తలతో ముంచెత్తారు. సీఐఎస్ఎఫ్ 53వ రైజింగ్ డే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. వివిధ ప్రైవేట్ పారిశ్రామిక, తయారీ రంగ యూనిట్లకు సమర్థవంతమైన భద్రతను అందించడానికి ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, సీఐఎస్ఎఫ్ ఒక్కటవ్వచ్చని ఆయన అన్నారు.
అంతేకాకుండా కరోనా విపత్కర పరిస్థితుల్లో పౌరులను గమ్యం చేర్చడంలో సాయపడ్డారని అన్నారు. తాజాగా ఆపరేషన్ గంగా మిషన్‌లో భాగంగా ఉక్రెయిన్ నుంచి పౌరులను స్వదేశానికి వీరే స్వాగతించారని చెప్పారు. మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని అన్నారు. సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దేశంలో ప్రైవేట్ భద్రతా ఏజెన్సీలకు శిక్షణ, సర్టిఫికెట్ ఇవ్వడంలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఎయిర్ పోర్ట్, సీపోర్ట్ కార్గో, కౌంటర్ డ్రోన్, మెరైన్, రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టంలో కీలకంగా మారేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.