Kantara Chapter-1: ‘కాంతార చాప్టర్-1’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్‌తో హైప్ పెంచేస్తున్న టీమ్
2022లో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ (Biggest Blockbuster) హిట్ సొంతం చేసుకున్న చిత్రం ‘కంతార’ (Kantara).
దిశ, సినిమా: 2022లో చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ (Biggest Blockbuster) హిట్ సొంతం చేసుకున్న చిత్రం ‘కంతార’ (Kantara). కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishabh Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ (box office) వద్ద పెద్ద ప్రభంజనం సృష్టించింది. అలాగే.. కేవలం రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 450 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డులను సృష్టించింది. అలాంటి ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) అనౌన్స్ చేసినప్పటి నుంచి.. ఈ మూవీపై భారీ అంచనాలు పెరగడంతో పాటు ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ (Periodic Action Thriller)గా రాబోతున్న ఈ చిత్రాన్ని హోంబలే పిలిమ్స్ (Hombale Films) పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు.
అయితే.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫిషీయల్‌గా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. ఈ మేరకు హోంబలే ఫిలిమ్స్.. ‘గుసగుసలకు చెక్ పెట్టి.. అందరూ ఎదురుచూస్తోన్న మూమెంట్ రానే వచ్చింది.. ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయింది’ అంటూ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఈ మూవీ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఇందులో జయరామ్ (Jayaram) కీలక పాత్రలో కనిపించనున్నారు.