TG Govt.: ఉపాధ్యాయులకు తీపి కబురు.. మ్యూచువల్ బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యూచువల్ బదీల (Mutual Transfers)లకు తెలంగాణ సర్కార్ (Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యూచువల్ బదీల (Mutual Transfers)లకు తెలంగాణ సర్కార్ (Telangana Government) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా (Yogitha Rana) జీవో నెం.70 (GO No.70)ని విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహా రెడ్డి (EV Narasimha Reddy) రాష్ట్రంలో ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు సంబంధించిన దరఖాస్తుల లిస్ట్‌ను ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపుతూ మార్గరద్శకాలు విడుదల చేశారు. బదిలీలపై ఇప్పటికే విద్యా శాఖకు 626 దరఖాస్తులు అందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,252 మంది ఉపాధ్యాయులు వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ కానున్నారు.