‘జటాధర’ షూటింగ్ పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన యంగ్ బ్యూటీ.. ఇంతకన్నా ఏం చెప్పలేనంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ప్రస్తుతం తెలుగులో ‘జటాధర’(Jatadhara) అనే మూవీలో నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక రీసెంట్‌గా ఈ భామ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసిన సంగతి విదితమే.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ జటాధర మూవీకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ జరుగుతుంది. ఇలాంటి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది.
ఇందులో నా పాత్ర మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నాను. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తున్న కల్కి బ్యూటీ.. నెటిజన్ల రియాక్షన్ ఇదే(పోస్ట్)