నిమిషాల్లో కార్చిచ్చు నియంత్రణ.. టెక్నాలజీతో పరిష్కారం

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా క్లెమేట్ చేంజ్‌‌కు కారణమవుతున్న ఫారెస్ట్ ఫైర్స్‌(కార్చిచ్చు) సమస్యకు పరిశోధకులు సరికొత్త పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు.

Update: 2022-07-18 11:32 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా క్లెమేట్ చేంజ్‌‌కు కారణమవుతున్న ఫారెస్ట్ ఫైర్స్‌(కార్చిచ్చు) సమస్యకు పరిశోధకులు సరికొత్త పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. నిమిషాల వ్యవధిలోనే ప్రమాదాన్ని గుర్తించే సామర్థ్యమున్న 'అల్ట్రా-ఎర్లీ వైల్డ్‌ఫైర్ డిటెక్షన్ సెన్సార్స్'ను ఆవిష్కరించారు. ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సెల్యులార్ కవరేజ్ అవసరం లేకుండానే పనిచేస్తాయి. మంటలు వ్యాపించకముందే గ్యాస్‌ను గుర్తించే ఈ సెన్సార్స్‌ను చెట్లపై అమర్చడం ద్వారా అగ్నిమాపక సిబ్బంది గంటలోపే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే అవకాశముంది.

ఈ సెన్సార్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవడంతో పాటు ఫారెస్ట్ ఎడ్జ్‌లో ఉండే గేట్‌వే‌కు తిరిగి కనెక్ట్ చేయబడతాయి. కెమెరాలు, ఉపగ్రహాలను వినియోగించి అడవిలో చెలరేగే మంటలను కనిపెట్టడం కంటే కూడా ఆ మంటలను క్లౌడ్ - బేస్డ్ అలర్ట్ ద్వారా గుర్తించడం ద్వారా సమస్యకు వేగవంతమైన పరిష్కారాన్ని చూపుతుంది. పైగా ఉపగ్రహ చిత్రాలతో పొగ మంటలను గుర్తించేందుకు నెల రోజులు పడితే.. కెమెరాలను ఉపయోగిస్తే గంటలు పట్టొచ్చు. కానీ ఈ టెక్నాలజీ ద్వారా నిమిషాల వ్యవధిలోనే గుర్తించవచ్చు.

వోడాఫోన్ బిజినెస్, ఎక్స్‌ట్రీమ్ E మధ్య భాగస్వామ్య ఫలితమైన 'స్మార్ట్ ఫారెస్ట్'.. వాతావరణ మార్పుల ప్రభావాల కారణంగా ఏర్పడే సమస్యల పరిష్కారంపై దృష్టిసారిస్తోంది. ఇటలీ సర్డినియా-2001లో 20 వేల చెట్లు, మొక్కలు అగ్నికి ఆహుతి కాగా వెయ్యి మంది ప్రజలు, 30 మిలియన్ బీస్ చనిపోయాయి. ఇక యూరోపియన్ యూనియన్స్ కోపర్నికస్ మానిటరింగ్ సర్వీస్ ప్రకారం.. ఈ వైల్డ్ ఫైర్ 1.76 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాల విడుదలకు కారణమైది. ఇది జర్మనీ ఏటా ఉత్పత్తి చేసే పది రెట్ల కార్బన్‌డైఆక్సైడ్ ఎమిషన్స్‌కు సమానం.

Tags:    

Similar News