పిల్లలు పుట్టాక మతిమరుపు సమస్య వెంటాడుతోందా..? పరిష్కారమేంటి?

పిల్లలు పుట్టాక స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

Update: 2025-01-05 11:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పిల్లలు పుట్టాక స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కొంతమందిలో మానసిక సమస్య, మరికొంతమంది తల్లుల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది కొత్త తల్లులు చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతుంటారు. మెమోరీ లాస్ అవ్వడం వల్ల శారీరక, భావోద్వేగ, హార్మోనల్ ఛేంజెస్ కూడా జరుగుతుంది.

ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలు జన్మించాక.. ప్రొజెస్టరోన్, ఓక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లులకు నేచురల్‌గా మరింత సానుభూతిని కలిగించేందుకు కారణం అవుతుంది. కాగా హార్మోన్ల ప్రభావంతో పలు సందర్భాల్లో మెమోరీ లాస్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల మిగతా విషయాలు మార్చిపోతుంటారు. అలాగే కొత్త తల్లులకు తగినంత నిద్ర ఉండదు. దీంతో మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీంతో జ్జాపకశక్తి తగ్గిపోతుంది.

అలాగే గర్భధారణ తర్వాత తల్లులు అనుభవించే భావోద్వేగ మార్పులు కూడా తమ మానసిక స్థితిపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఆందోళన, భాధలు లాంటివి. తరచూ అలసటగా ఫీల్ అవ్వడం, శరీరంలో జబ్బులు జ్జాపకశక్తి మందగించడానికి కారణమవుతుంది.

కాగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలంటే శరీరానికి సరిపడ నిద్ర ఉండాలంటున్నారు నిపుణులు. అలాగే నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. జ్జాపకశక్తిని పెచే పలు వ్యాయామాలు కూడా చేయాలి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News