ఆలియా, రణబీర్ జంటకు కవల పిల్లలా?
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ఆలియా భట్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే..Latest Telugu News
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ ఆలియా భట్ గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఈ వార్త ఆమె కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లోనూ సంతోషం నింపగా.. పుట్టబోయేది అమ్మాయా లేక అబ్బాయా? అనే చర్చ నెట్టింట కొనసాగుతోంది. అంతేకాదు పిల్లల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఆలియా, రణబీర్ కొంతమంది ఫేమస్ జ్యోతిష్కులను సంప్రదించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇద్దరు మగ పిల్లలతో ఆశీర్వదించబడతారని జ్యోతిష్కుడు చెప్పినట్లు సమాచారం. పైగా పుట్టబోయే పిల్లలు బాలీవుడ్లో సూపర్స్టార్లు అవుతారని అతను అంచనా వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటుండగా.. కొందరు మాత్రం వారికి పుట్టబోయేది ఆడపిల్లేనని ఖరాకండిగా చెబుతున్నారు.