IPL vs PSL.. ఏ T20 లీగ్‌లో ఎక్కువ ప్రైజ్ మనీ..?

Update: 2022-03-02 04:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ''ఇండియన్ ప్రీమియర్ లీగ్''(IPL), ''పాకిస్తాన్ సూపర్ లీగ్''(PSL) ఈ రెండు లీగ్ లు ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్రాంచైజీలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రెండు లీగ్ లకు ప్రేక్షకులు కూడా పెద్ద మొత్తంలో ఉంటారు. అయితే ఇప్పడు ఈ రెండు లీగ్‌లలో ఎక్కవ ప్రైజ్ దేనిది అనే ప్రశ్న క్రికెట్ అభిమానుల్లో వ్యక్తమవుతుంది. గత నెలలో ఐపీఎల్ 15 వ సీజన్ కోసం జరిగిన మెగా వేలం లో 10 ఐపీఎల్ జట్లు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

ఇటివల( ఫిబ్రవరి 27)న పీఎస్ఎల్ లీగ్ ముగిసింది. షాహీన్ షా అఫ్రిది నేతృత్వంలోని లాహోర్ ఖలాండర్స్ జట్టు మొదటి సారి టైటిల్ ను గెలుచుకుంది. PSL 2022 విజేతగా నిలిచినందుకు లాహోర్ జట్టు Qalandars PKR 80 మిలియన్ల ( సుమారు రూ. 3.40 కోట్లు) ప్రైజ్ మనీ అందుకున్నారు. 2021లో ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది. అంటే IPL విజేత జట్టు ప్రైజ్ మనీ PSL కంటే ఐదు రెట్లు ఎక్కువ.

Tags:    

Similar News