కాలేజీకి ఊహకందని రేంజ్‌లో విరాళమిచ్చిన పూర్వ విద్యార్థి
దిశ, వెబ్‌డెస్క్: పుట్టిన ఊరు, కని పెంచిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: పుట్టిన ఊరు, కని పెంచిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కానీ, వందలో ఒక్కరో.. ఇద్దరో మాత్రమే ఎంతో కొంత సహాయం చేస్తుంటారు. కొందరు పెరిగిన బాధ్యతలు, ఆర్థిక కారణాల వల్ల చేయాలనుకున్నా.. పరిస్థితులు సహకరించవు. కానీ, ఒక వ్యక్తి మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సహాయం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ కాలేజీకి ఇండిగో కో ఫౌండర్ రాకేశ్ గంగ్వాల్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ డబ్బుతో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించనున్నారు. అంతేగాక, 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. మూడేళ్లలో పనులు పూర్తిచేసి ఆస్పత్రి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి గంగ్వాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీగా పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాను చదువుకున్న కాలేజీకి ఇంత మొత్తంలో డొనేషన్ ఇవ్వడంపై స్థానికంగా ఉన్న యువకులతో పాటు మేధావులు, ప్రముఖులు అతన్ని అభినందిస్తున్నారు.