అమెజాన్‌లో లక్ష దాటిన భారతీయ ఎగుమతిదారులు!
దిశ, వెబ్‌డెస్క్: భారత్ నుంచి ఎగుమతులను చేస్తున్న 1,00,000 మంది వ్యాపారులు అమెజాన్ ద్వారా గ్లోబల్..telugu latest news
దిశ, వెబ్‌డెస్క్: భారత్ నుంచి ఎగుమతులను చేస్తున్న 1,00,000 మంది వ్యాపారులు అమెజాన్ ద్వారా గ్లోబల్ మార్కెట్లలో తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని అమెజాన్ ఇండియా గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2020, జనవరి నుంచి వ్యాపారుల సంఖ్య ఏడాదికి 30 శాతం చొప్పున పెరుగుతున్నారు. ఇందులో ఎక్కువమంది నాన్-మెట్రో ప్రాంతాల నుంచి ఉన్నారని, వీరిలో ఎక్కువమంది మొదటి తరం వ్యవస్థాపకులతో పాటు కొత్త బ్రాండ్ల ద్వారా మార్కెట్లోకి వచ్చిన వారేనని అమెజాన్ ఇండియా తెలిపింది. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ కార్యక్రమం ద్వారా లక్ష మందికి పైగా భారత ఎగుమతిదారులు 3 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 23 వేల కోట్ల) విలువైన వ్యాపారాన్ని నిర్వహించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను సూచిస్తుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ అభిజిత్ కమ్రా అన్నారు.
దేశీయ ఎగుమతిదారులు 200 దేశాల్లో సుమారు 14 కోట్ల మందికి పైగా వినియోగదారులు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 2015లో కేవలం 100 మంది ఎగుమతిదారులతో ప్రారంభించాం. ఇప్పుడు భారత్ నుంచి ఈ-కామర్స్ ఎగుమతుల్లో కీలకంగా ఈ విభాగం ఉందని అభిజిత్ పేర్కొన్నారు. భవిష్యత్తుల్లో భారత్ నుంచి ఎగుమతులను మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తాం. 2025 నాటికి ఈ ఎగుమతులను రూ. 75 వేల కోట్లను అధిగమించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.