రష్యా ఆయిల్ కొనుగోలుపై నిర్మలా సీతారామన్ ఫైర్..

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా రష్యాపై కోపం పెరిగింది. ఈ క్రమంలో.. Latest Telugu News..

Update: 2022-04-01 13:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా రష్యాపై కోపం పెరిగింది. ఈ క్రమంలోనే అనేక దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. కొన్ని దేశాలు దిగుమతులు నిలిపివేస్తే, మరికొన్ని ఎగుమతులను ఆపేశాయి. అంతేకాకుండా రష్యా నుంచి ఎటువంటి విక్రయాలు చేయొద్దంటూ ప్రపంచ దేశాలను సూచించాయి. ఈ తరహాలో సూచనలు వచ్చినప్పటికీ భారత్ మాత్రం ఆయిల్‌ను కొనుగోలు చేసింది. దాదాపు 3-4 రోజులకు సరిపడా మొత్తాన్ని భారత్ కొనుగోలు చేసింది. దీనిపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పందించారు. రష్యా నుంచి ఆయిల్ ఎందుకు కొనకూడదంటూ నిలదీశారు. 'అక్కడ డిస్కౌంట్ రేట్‌కు లభిస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు. నా దేశ జాతీయ ఆసక్తి, భద్రతకు పెద్దపీట వేస్తాను' అని నిర్మలా ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Tags:    

Similar News