Nitish Kumar Reddy : నితీశ్ రెడ్డిని ఆరవ స్థానంలో దించాలి.. : మైఖేల్ క్లార్క్
నితీశ్ కుమార్ రెడ్డిని సిడ్నీ టెస్ట్‌లో ఆరో స్థానంలో దించాలని ఆసీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ సూచించాడు.
దిశ, స్పోర్ట్స్ : నితీశ్ కుమార్ రెడ్డిని సిడ్నీ టెస్ట్‌లో ఆరో స్థానంలో దించాలని ఆసీస్ మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ సూచించాడు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడాడు. ‘నితీశ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్‌లను చూసి అతను భయపడలేదు. ఓపికతో బ్యాటింగ్ చేశాడు. టెయిల్ అండర్‌లో బ్యాటింగ్‌కు దిగి అద్భుతంగా ఆడాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో రాణించాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రెడ్డి జీనియస్. అతను భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. సిరీస్ ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అతన్ని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దించాలి.’ అని క్లార్క్ అన్నాడు.