Telangana Congress లో మరో కలకలం.. అతడి చేరికతో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!
Differences among Telangana Congress leaders to the fore again| తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడుక్కుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తూ.. పార్టీని పటిష్టం చేస్తోంది
దిశ, వెబ్‌డెస్క్: Differences among Telangana Congress leaders to the fore again| తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడుక్కుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలకు గాలం వేస్తూ.. పార్టీని పటిష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే, ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వంపై పోరాటాన్ని పక్కన పెట్టి.. అంతర్గత విభేదాలతో ప్రజల్లో చులకన అయిపోతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే టీ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.
అగ్గి రాజేసిన చెరుకు చేరిక..!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఉద్యమ నేత, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుక సుధాకర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. దీంతో మరోసారి టీ-కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంది. నల్లగొండ జిల్లా కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో తనను ఓడిస్తానని సవాల్ చేసి.. ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిని పార్టీలో చేర్చుకుని రేవంత్ పెద్ద తప్పు చేశారని.. ఇకపై రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరుల మధ్య నెలకొన్న వివాదం.. కాంగ్రెస్‌లో చెరుకు సుధాకర్ చేరికతో మరింత ముదిరింది. తన సొంత జిల్లా నేతను కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా పార్టీలో ఎలా చేర్చుకుంటారని కోమటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక వేళ కాంగ్రెస్ కీలక నేతల మధ్య విభేదాలతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు.
మా మధ్య విభేదాలు లేవు..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం కోమటిరెడ్డి బలంగా పనిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా వెంకట్ రెడ్డి పార్టీకి అనేక సేవలు చేశారని, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన కూడా పాల్గొంటారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేరు వెంకటరెడ్డి వేరని తాను చేసిన వ్యాఖ్యలు వెంకట్ రెడ్డిని ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చారు. కొందరు కావాలనే తమ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని అన్నారు. మేమంతా ఒక కుటుంబమని రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. తాను రేవంత్ ముఖం చూడనని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి: