ట్రెడిషినల్ లుక్‌లో మెరిసిపోతున్న యంగ్ హీరోయిన్.. వావ్ సూపర్ అంటూ నెటిజన్ల కామెంట్స్
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్(Iswarya Menon ) ‘తీయ వేలై సెయ్యనుం కుమారు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య మీనన్(Iswarya Menon ) ‘తీయ వేలై సెయ్యనుం కుమారు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుని క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక 2022లో ఈ అమ్మడు నిఖిల్(Nikhil) ‘స్పై’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
కానీ హిట్ అందుకోలేకపోయింది. 2024లో కార్తికేయ గుమ్మకొండా సరసన ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam)లో నటించి మెప్పించింది. దీని తర్వాత ఎలాంటి మూవీ ప్రకటించనప్పటికీ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. వరుస ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. తాజాగా, ఐశ్వర్య మీనన్ స్లీవ్ లెస్ లైట్ మెరూన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ ధరించి మెస్మరైజ్ చేస్తుంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు వావ్, సూపర్, గార్జియస్, స్టన్నింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.