Sonu Sood : రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి భార్యకు తీవ్రగాయాలు

ముంబై-నాగపూర్ హైవే(Mumbai-Nagpur Highway)పై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రముఖ నటుడు సోనూ సూద్?(Sonu Sood) భార్య సోనాలి సూద్(Sonali Sood) తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2025-03-25 09:56 GMT
Sonu Sood : రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి భార్యకు తీవ్రగాయాలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : ముంబై-నాగపూర్ హైవే(Mumbai-Nagpur Highway)పై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో ప్రముఖ నటుడు సోనూ సూద్?(Sonu Sood) భార్య సోనాలి సూద్(Sonali Sood) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోనాలి సూద్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో సోనాలితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సోనాలి సూద్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు, కారులో ప్రయాణిస్తున్న మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయినట్టు వార్తలు వస్తున్నప్పటికీ, ఖచ్చితమైన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఈ సంఘటనపై సోనూ సూద్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు. ఈ ప్రమాద విషయం బయటికి తెలియగానే సోనూ సూద్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోనాలి సూద్ త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, పలువురు బాలీవుడ్ నటులు కోరుకుంటున్నారు. 

Tags:    

Similar News