Davos Summit: దావోస్ సదస్సుకు హాజరుకానున్న సీఎం చంద్రబాబు, నారా లోకేష్

స్విట్జర్లాండ్‌(Switzerland)లోని దావోస్‌లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తుండడం తెలిసిందే.

Update: 2025-01-01 12:59 GMT

దిశ,వెబ్‌డెస్క్: స్విట్జర్లాండ్‌(Switzerland)లోని దావోస్‌లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ ఏడాదిలో జనవరి 20-24వ తేదీ వరకు దావోస్ సదస్సు జరగనుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(World Economic Forum) ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఏపీ మంత్రులు నారా లోకేష్(Minister Nara Lokesh), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు.

ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించేందుకు దావోస్ వేదికను(Davos Summit) వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అనుకుంటున్నారు. ఇందుకోసం ‘‘షేపింగ్ ద ఇంటెలిజెంట్ ఏజ్’’ థీమ్‌తో ఏపీ బృందం దావోస్‌లో ప్రదర్శన ఏర్పాటు చేయనుంది. దావోస్ పర్యటన కోసం ఏపీ సీఎం బృందం ఈ నెల 19న సీఎం, లోకేష్, పరిశ్రమలు, ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు అధికారులు అక్కడికి బయల్దేరనున్నారు. సాంకేతిక పాలన, రెన్యువబుల్ ఎనర్జీ, స్మార్ట్ సిటీస్, మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ఇందుకోసం కేంద్రం సదస్సులో ఏపీకి స్టాల్ రిజర్వ్ చేసింది.

Tags:    

Similar News