తల్లీతండ్రిమరణంతో అనాథలైన పిల్లలు

మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి నలుగురు పిల్లలు అనాధలయ్యారు.

Update: 2025-01-01 12:49 GMT

దిశ,వెల్దండ: మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి నలుగురు పిల్లలు అనాధలయ్యారు. బుధవారం చెట్ల కాశన్న ఆనారోగ్యంతో మృతి చెందారు. కాశన్న కు ఇద్దరు భార్యలు కాగా..మొదటి భార్య గతంలో మృతిచెందగా, రెండవ భార్య సంవత్సరం క్రితం మృతి చెందింది. కాశన్న గతంలోనే అనారోగ్య బారినపడడం కుమారుడు నవీన్ కు తోడుగా ఉంటూ వ్యవసాయ పనులు చూసుకునేవాడు. ఇటీవల మూడు నెలల క్రితం నవీన్ కి రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ లో చికిత్స పొందాడు. దీంతో కుటుంబం పైన పెనుబారం పడింది. అన్ని తానై నవీన్ బాధ్యతలు తన భుజాన వేసుకుని వ్యవసాయం చేస్తూ..ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తండ్రి మృతి చెందడంతో పిల్లలు నవీన్, శిరీష, రేణుకా, శివరాణి అనాధలయ్యారు. అయ్యో పాపం తల్లిదండ్రులు కోల్పోయారంటూ నలుగురు పిల్లల పరిస్థితి ఏంటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పథంతో పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News