పదవ తరగతి బాలుడు.. ఎంత పని చేశాడో తెలుసా.. చూస్తే షాక్!
దిశ, వెబ్ డెస్క్: పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు.- Latest Telugu News
దిశ, వెబ్ డెస్క్: పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. పరీక్షల్లో పాస్ అవ్వాలని కొందరు.. ఎక్కువ మార్కులు సాధించాలని ఇంకొందరు తీవ్ర ఆందోళన చెందుతారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని పరీక్షల సమయంలో చదవుకోవాలని కాస్త కఠినంగా వ్యవరిస్తూ భయపెడుతుంటారు. దీనితో పరీక్షల్లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో కొందరు విద్యార్థులు ఇంట్లో నుంచి పారిపోవడం.. ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ బాలుడు పరీక్షలలో ఫెయిల్ కావొద్దని వార్నింగ్ ఇచ్చిన కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడు.
వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గుణా ప్రాంతానికి చెందిన వీరేంద్ర (15) అనే యువకుడు 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్షల సమయం దగ్గర పడటంతో తండ్రి దులిచంద్ అహిర్వార్ కొడుకుని చదువుకోవాలని.. పరీక్షల్లో ఫెయిల్ కావొద్దని హెచ్చరించాడు. అయితే పరీక్షల్లో ఫెయిల్ అవుతే తండ్రి కొడుతాడని వీరేంద్ర భయపడ్డాడు. దీనితో ఆ బాలుడు కన్న తండ్రిని కత్తితో పొడిచి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే దులిచంద్ మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పరీక్షల్లో ఫెయిల్ అయితే తండ్రి కొడతాడనే భయంతో హత్య చేశానని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.