Gopichand: ‘విశ్వం’ టీం ఆ తప్పు చేయకుంటే .. ఈ రోజు సినిమా టాక్ ఇంకోలా ఉండేది
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన మూవీ ‘విశ్వం’.
దిశ, వెబ్ డెస్క్ : గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన మూవీ ‘విశ్వం’. అనే మూవీ రూపొందింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ పతాకం పై టి.జి.విశ్వప్రసాద్ ఈ మూవీకి బాగానే ఖర్చు పెట్టారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రిలిజ్ ముందే టీజర్, ట్రైలర్స్ బాగానే ఆకట్టుకున్నాయి. ఎంత చిన్న సినిమా అయినా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.
‘విశ్వం’ సినిమా నుంచి ఒక్క మంచి సాంగ్ కూడా రాలేదు. అయితే, రిలీజ్ కు ముందు ‘గుంగురు గుంగురు’ అనే మాస్ పాటను రిలీజ్ చేసారు. సురేష్ గంగుల ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాటలో గోపీచంద్, కావ్య థాపర్ లు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
అయితే, ఇలాంటి మంచి పాటని రిలీజ్ ముందు విడుదల చేయడం వల్ల మైనస్ అవుతుంది కానీ, ప్లస్ అవ్వదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు . ఈ పాటను కనీసం వారం రోజుల ముందు రిలీజ్ చేసిన సినిమా మంచిగా ప్రమోట్ అయ్యేది. ఇక్కడ ‘విశ్వం’ టీం ప్లాన్ వర్కౌట్ అవ్వలేదనే చెప్పుకోవాలి.