Naga Vamsi: సినిమా ఫ్లాప్ అయితే మరి మా డబ్బులు మాకు ఇస్తారా.. ఆ నిర్మాత పై మండిపడుతున్న నెటిజన్స్
రూ.1500 మేము పెడతాం .. సినిమా ఫ్లాప్ అయితే మరి మా డబ్బులు మాకు ఇస్తారా..
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ కూడా (Naga Vamsi ) ఒకరు. ఈయన ఎన్నో సినిమాలను నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. చిన్న చిన్న హీరోలను ఎంకరేజ్ చేస్తూ పెద్ద సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంటున్నాడు. ఇంకోవైపు స్టార్ హీరోలను కవర్ చేస్తూ లాభాలు అందుకుంటున్నాడు.
దేవర (Devara ) మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాగ వంశీ మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ మూవీ నిర్మిస్తున్నాడు. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంటర్యూలో నిర్మాత నాగ వంశీ షాకింగ్ కామెంట్స్ చేసాడు.
" ఫ్యామిలీకి రూ.1500 పెట్టలేరా.. ఇంత తక్కువలో అమౌంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడా దొరకదు. ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ సినిమాకి మించిన ఎంటర్‌టైన్ చేసే ఎలిమెంట్ ఇంకోటి లేదని " చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. " రూ.1500 మేము పెడతాం .. సినిమా ఫ్లాప్ అయితే మరి మా డబ్బులు మాకు ఇస్తారా.. " అంటూ నాగ వంశీని జనాలు ఏకిపారేస్తున్నారు.