భార్య డోర్ ఆలస్యంగా తీసిందని నరికి చంపిన భర్త..

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం భార్య, భర్తల బంధాలు చిన్న చిన్న వాటికే విచ్ఛిన్న మవుతున్నాయి..Latest Telugu News

Update: 2022-07-03 09:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం భార్య, భర్తల బంధాలు చిన్న చిన్న వాటికే విచ్ఛిన్న మవుతున్నాయి. అనవసర విషయాలకు అర్ధం చేసుకోకుండా కోపంతో రగిలిపోయి ఊహించని నిర్ణయాలు తీసుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది.

బెంగళూరులోని కొప్పళ జిల్లా గంగావతికి చెందిన మంజుల మొదటి భర్తను వదిలేసి రాము అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. బెంగళూరులోని కామాక్షి కాలనీలో రాముతో కలిసి నివాసం ఉంటుంది. కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కూలీ పనులు ముగించుకొని రాము ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. మంజుల డోర్ ఆలస్యంగా తీసింది. అంతేకాకుండా అన్నం కూడా పెట్టలేదు. దాంతో కోపోద్రిక్తుడైన రాము, మంజులను నరికేశాడు. అది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Similar News