భర్తను అద్దెకిస్తున్న మహిళ.. వెబ్‌సైట్ ద్వారా సర్వీస్
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో ‘రెంట్’కు దొరకని సర్వీస్ అంటూ ఏదీ లేదు. అంతెందుకు పెళ్లి వేడుకల్లో ‘బంధుమిత్రుల’ను ఏర్పాటుచేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు కూడా లెక్కలేదు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఈ రోజుల్లో 'రెంట్'కు దొరకని సర్వీస్ అంటూ ఏదీ లేదు. అంతెందుకు పెళ్లి వేడుకల్లో 'బంధుమిత్రుల'ను ఏర్పాటుచేసే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు కూడా లెక్కలేదు. ఇవన్నీ ఒకెత్తయితే.. ఓ మహిళ ఏకంగా తన భర్తనే ఇతర స్త్రీలకు అద్దెకిస్తోంది. అందుకోసమే 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇంతకీ ఆమె భర్తను ఎందుకు రెంట్‌కు ఇస్తోంది? ఎవరికి ఇస్తోంది? వంటి విశేషాలు తెలుసుకుందాం.
యూకేకు చెందిన లారా యంగ్ భర్త 'జేమ్స్'కు DIY(డూ ఇట్ యువర్‌సెల్ఫ్)లో మంచి పట్టుంది. కస్టమ్ బెడ్స్ మేకింగ్, కిచెన్ రెనొవేషన్, స్క్రాప్ నుంచి డైనింగ్ టేబుల్ తయారు చేయడం ద్వారా బకింగ్‌హామ్‌షైర్‌లోని తన ఇంటి స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. అంతేకాదు కలర్‌ఫుల్ పెయింట్స్‌తో ఇంటిని అందంగా డెకోరేట్ చేయడంతో పాటు టైల్ వర్క్ కూడా చేయగలడు. అయితే భర్త నైపుణ్యాలను ఎలాగైనా ఉపయోగించుకోవాలని భావించిన లారా.. 'రెంట్ మై హ్యాండీ హస్బెండ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఫేస్‌బుక్ సహా ప్రముఖ నెక్స్ట్‌డోర్ యాప్‌లో ప్రచారం చేసింది.
సగటున ఒక ఇంటికి రూ. 3,400 (£35) చొప్పున బడ్జెట్ ఫ్రెండ్లీ సర్వీస్ అందిస్తున్న జేమ్స్.. గోడకు టీవీ ఫిట్టింగ్, బ్లైండ్‌ను అమర్చడం, ఫెన్సింగ్‌కు పెయింటింగ్ వేయడం వంటి చిన్న పనులు కూడా చేసి పెడతాడు. ఈ క్రమంలోనే వికలాంగులు, యూనివర్సల్ క్రెడిట్‌లో ఉన్నవారికి, 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు తగ్గింపు ధరలు అమలు చేస్తు్న్నాడు. అందిస్తున్నారు.
గతంలో నైట్ షిఫ్ట్ వేర్‌హౌస్ వర్కర్‌గా పనిచేసిన జేమ్స్‌కు ముగ్గురు పిల్లల కాగా.. వారిలో ఇద్దరు ఆటిస్టిక్‌తో బాధపడుతున్నారు. దీంతో పిల్లలకు తోడుగా ఉండేందుకు కొన్నేళ్ల కిందట ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇతను మోటార్ మెకానిక్స్ చదివేందుకు కాలేజీకి తిరిగి వెళ్లాలనుకుంటున్నాడు. ఏదేమైనా అతడు ఈ ఉద్యోగంలో మంచి స్థాయికి వెళతాడు. మొదట ఈ సైట్ పేరు విని చాలామంది తప్పుగా భావించారు. కానీ ఇప్పుడిప్పుడే మా సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు' అని లారా పేర్కొంది.