Health Tips: భుజంగాసనం ఎలా చేయాలి? ప్రయోజనాలేంటి?

భుజంగాసనం: ముందుగా బోర్లా పడుకోవాలి. పాదాలు దగ్గరగా ఉంచాలి. చేతులు రెండూ భుజాల

Update: 2022-04-10 07:57 GMT

భుజంగాసనం: ముందుగా బోర్లా పడుకోవాలి. పాదాలు దగ్గరగా ఉంచాలి. చేతులు రెండూ భుజాల కిందుగా, నాభి భాగానికి పక్కగా శరీరానికి దగ్గరగా ఉంచాలి. అరచేతులు పూర్తిగా నేలకు ఆన్చాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ ముందుగా తలను, తర్వాత శరీర ఊర్థ్వ భాగాన్ని పైకి లేపాలి. నడుము భాగం వరకు పైకి లేపి, తలను ఆకాశం వైపు ఎత్తాలి. ఇదే స్థితిలో 5 నుంచి 8 సెకన్ల పాటు ఉండాలి. నెమ్మదిగా గాలి వదులుతూ యథాస్థితికి రావాలి.

జాగ్రత్తలు :

* అండాశయం, మూత్రాశయం సమస్యలను నివారిస్తుంది.

* స్త్రీలకు రుతుక్రమం సక్రమంగా వస్తుంది.

* మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫలితాలనిస్తుంది.

* అన్ని రకాల నొప్పుల నివారణకు ఉత్తమంగా పని చేస్తుంది.

Tags:    

Similar News