యంత్రమయంగా మనిషి.. ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న మైక్రోచిప్ ఇంప్లాంట్స్
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మానవుల శరీరాల్లోకి మైక్రోచిప్స్ ఎక్కువగా ఇంజెక్ట్ చేయబడుతున్నాయి..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మానవుల శరీరాల్లోకి మైక్రోచిప్స్ ఎక్కువగా ఇంజెక్ట్ చేయబడుతున్నాయి. ఇవి డోర్స్ అన్‌లాకింగ్, పేమెంట్ ప్రాసెసింగ్ నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ రికార్డుల వరకు ప్రతీ విషయాన్ని స్టోర్ చేయగలవు. అలాగే 'హ్యూమన్ సైబోర్గ్(ఆర్గానిక్, బయోమెకట్రానిక్ శరీర భాగాలు కలిగిన జీవి)' కూడా మైక్రోచిప్స్ ఇంప్లిమెంట్ చేయబడిన వ్యక్తులను పోలి ఉంటుంది. ధాన్యపు గింజ పరిమాణంలో ఉండే ఈ క్యాప్యూల్స్.. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై సిగ్నల్స్(RFID) ద్వారా సేకరించిన డేటాకు ప్రతిస్పందిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్‌లో పాస్‌వర్డ్స్, కీస్‌ను RFID చిప్స్ లేదా ఇంప్లాంటెడ్ మాగ్నెట్స్ రీప్లేస్ చేస్తాయి. అనేక రకాలుగా మానవ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి.
సైబోర్గ్ అంటే ఏమిటి?
ఆర్గానిక్, బయోమెకట్రానిక్ శరీర భాగాలను కలిగిన వ్యక్తిని సైబోర్గ్(సైబర్నెటిక్, ఆర్గానిజం అనే పదాల కలయిక)గా సూచిస్తారు. ఈ పదాన్ని నాథన్ S. క్లైన్, మాన్‌ఫ్రెడ్ క్లైన్స్ తొలిసారిగా 1960లో రూపొందించారు. ఇది బయోనిక్స్, బయో-రోబోటిక్స్ లేదా ఆండ్రాయిడ్స్‌కు విరుద్ధంగా.. ఫీడ్‌బ్యాక్‌పై ఆధారపడే సింథటిక్ కాంపోనెంట్ లేదా టెక్నాలజీ ఏకీకరణ కారణంగా మెరుగైన సామర్థ్యాలను కలిగి ఉన్న జీవిని సూచిస్తుంది. ఇంప్లాంట్ చేయగల కార్డియోవర్టర్-డీఫిబ్రిలేటర్ లేదా సింథటిక్ కార్డియాక్ పేస్‌మేకర్‌ను కలిగిన వ్యక్తిని సైబోర్గ్‌కు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యంత్రాలు ఎలక్ట్రికల్ విద్యుత్ ఉద్దీపనలను, సిగ్నల్స్‌ను ప్రాసెస్ చేయడంతో పాటు బాడీలోని వోల్టేజ్ పొటెన్షియల్స్‌ను కొలవగలవు. మొత్తానికి ఒక మనిషిని సజీవంగా ఉంచేందుకు ఈ ఆర్టిఫిషియల్ ఫీడ్‌బ్యాక్ సిస్టమ్‌ను ఉపయోగిస్తారు.
రోబో Vs సైబోర్గ్
ఈ సైబోర్గ్‌లు, రోబోట్‌లు సైన్స్ ఫిక్షన్ ప్రధానమైనవిగా కనిపించాయి. కానీ ఈ రెండు ఉనికిలో ఉన్నట్లు చాలామందికి తెలియదు. వాస్తవానికి రోబో అత్యంత అభివృద్ధి చెందిన యంత్రం. ఇది తరచూ ఆటోమేషన్‌ను కలిగి ఉండటంతో పాటు వ్యక్తులతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండదు. కానీ సైబోర్గ్.. రోబోకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక వ్యక్తిగా ఉండవలసిన అవసరం లేదు. కుక్కగా, పక్షిగా, జీవించే మరేదైనా జంతువుగానూ ఉంటుంది. అంతేకాకుండా దీనికి లైఫ్ కాంపోనెంట్ ఉంది.
RFID చిప్
బియ్యపు గింజ పరిమాణంలో ఉండే ఈ చిప్ వివిధ రకాల సమాచారాన్ని స్టోర్ చేస్తుంది. దీన్ని ఇంప్లాంట్ చేసుకున్న వ్యక్తిని స్కాన్ చేసినపుడు అతని ఐడి నెంబర్‌తో పాటు ఇతర డేటాను అందిస్తుంది. ప్రజా రవాణాను యాక్సెస్ చేయడానికి, సెక్యురిటీ పాయింట్ గుండా వెళ్తున్నపుడు ఇన్ఫర్‌మేషన్‌ను కమ్యునికేట్ చేయడానికి, కిరాణా షాపుల చెక్ అవుట్‌లో లాంగ్‌లైనప్స్‌ను రిమూవ్ చేయడానికి అనుమతిస్తుంది.