Vazhai: బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు.. డైరెక్టర్‌కు రుణపడి ఉంటాను.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం (success) అందుకున్న చిత్రం ‘వాళై’ (Vazhai).

Update: 2024-10-15 09:13 GMT

దిశ, సినిమా: చిన్న సినిమాగా వచ్చి మంచి విజయం (success) అందుకున్న చిత్రం ‘వాళై’ (Vazhai). ఇందులో కలైయరసన్ (Kaliyarasan), నిఖిలా విమల్ (Nikhila Vimal), ప్రియాంకా నాయర్ (Priyanka Nair) తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆయన సొంత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రంలో పూంగొడి టీచర్‌గా నటించి ప్రేక్షకులను అలరించి మెప్పించింది హీరోయిన్ నిఖిలా విమల్ (Nikhila Vimal). తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview) లో పాల్గొన్న నిఖిలా విమల్ (Nikhila Vimal)  డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించింది.

‘‘వాళై’ (Vazhai) మూవీలో యాక్ట్ చేసే అవకాశం రావడం గొప్ప విషయం. నేను ఒక పరికరాన్ని మాత్రమే. ఆ పాత్రకు తగినట్టుగా దర్శకుడు (Director) నన్ను ములుచుకున్నారన్నారు. ‘కర్ణన్‌’ చిత్రంలో హీరోయిన్‌ రజీషా విజయన్‌ (Rajisha Vijayan) పాత్రకు డబ్బింగ్‌ (dubbing) చెప్పడానికి చెన్నైకి వచ్చాను. ఆ సమయంలోనే ‘వాళై’ (Vazhai) చిత్రం గురించి డైరెక్టర్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం చిత్రాన్ని నిర్మించి, అందులో నా కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచిపోయే పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు మారి సెల్వరాజ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. ప్రజెంట్ ‘వాళై’ (Vazhai) చిత్రం ఓటీటీ(OTT) లో దూసుకుపోతోంది.


Similar News