యాక్టింగ్ బాగా నచ్చిందని ఫోన్ చేశా.. సాయిపల్లివి అలా పిలవడంతో షాక్ అయ్యా.. : Siva Karthikeyan

ఆ సినిమాలో తన నటనకు ఫిదా అయ్యాను.

Update: 2024-10-20 07:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ (Siva Karthikeyan) సాయి పల్లవి (Sai Pallavi) కలిసి నటించిన మూవీ 'అమరన్'.  రాజ్‌కుమార్‌ పెరియసామి డైరెక్షన్ లో వచ్చిన సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్, స్టార్ హీరో కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించగా, జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ చెన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను గ్రాండుగా నిర్వహించారు.

అయితే, ఈ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్.. సాయి పల్లవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివకార్తికేయన్ మాట్లాడుతూ.. "నేను ఓ ఛానల్‌లో వర్క్ చేస్తున్నప్పుడు సాయి పల్లవిని మొదటిసారి మీట్ అయ్యాను. అప్పటికే సాయి ప‌ల్లవి డ్యాన్స్ షో వలన చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత 'ప్రేమమ్' మూవీలో పల్లవిని చూసి షాక్ అయ్యాను. ఆ సినిమాలో తన నటనకు  ఫిదా అయ్యాను. వెంటనే ఫోన్ చేసి ఆమెను బాగా పొగిడేసాను. అయితే, అప్పుడు పల్లవి ''థాంక్యూ అన్న'' అని అన్నది. అంతే నా హార్ట్ బ్రేక్ అయింది. మీరు ''అన్న'' అని మాత్రం పిలవకండని సాయిప‌ల్ల‌వికి చెప్పాను" అంటూ  సరదాగా ఆ ఫన్నీ ఇన్సిడెంట్ ను గుర్తుచేసుకున్నారు. 

Tags:    

Similar News