Sub Inspector Yugandhar: సబ్ ఇన్‌స్పెక్టర్‌గా స్టార్ హీరో కొడుకు.. నెట్టింట ఫొటోలు వైరల్

ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన సాయికుమార్ (Saikumar) కొడుకు ఆదిత్య (Aditya).. ‘ప్రేమ కావాలి’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.

Update: 2024-11-16 10:22 GMT

దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలిన సాయికుమార్ (Saikumar) కొడుకు ఆదిత్య (Aditya).. ‘ప్రేమ కావాలి’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఇక ‘జంగల్’ మూవీతో తమిళ్ (Tamil) ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. ఇప్పుడు తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశాడు ఈ హీరో.

‘సబ్ ఇన్‌స్పెక్టర్ యుగంధర్’ (Sub Inspector Yugandhar) అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆది (Aadi) హీరోగా, మేఘా లేఖా (Megha Lekha) హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కాగా.. హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan) ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాని శ్రీపినాక మోషన్ పిక్చర్‌పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తుండగా.. యశ్వంత్ తాపీ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నారు చిత్ర బృందం.


Click Here For Twitter Post..

Tags:    

Similar News

టైగర్స్ @ 42..