కేవలం జలుబు-దగ్గు ఉన్నప్పుడే కాదు.. రోజు ఈ డ్రింక్స్ తీసుకుంటే..?
సాధారణమైన సమస్యల్లో జలుబు, దగ్గు ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: సాధారణమైన సమస్యల్లో జలుబు(cold), దగ్గు(cough) ఒకటి. జలుబు చేస్తే ముక్కు దిబ్బడతో చాలా సఫర్ అవుతుంటారు. శ్వాస సరిగ్గా రాదు. తరచూ తుమ్ములు వస్తుంటాయి. ఇక దగ్గు విషయానికొస్తే.. దగ్గినప్పుడల్లా ఊపిరిత్తుల్లో ఓ రకమైన మంట వస్తుంది. కొన్నిసార్లు వాంతులు కూడా చేసుకునే పరిస్థితులు నెలకొంటాయి. అయితే జలుబు, దగ్గు తగ్గాలంటే అప్పటివరకే మందులు లేదా ఇంట్లో తయారు చేసిన చిట్కాలు వాడుతుంటారు. అయితే రోగనిరోధక శక్తి తగ్గిపోకుండా.. మళ్లీ కోల్డ్, కఫ్ దరిచేరకుండా ఉండాలంటే నిపుణులు ఈ డ్రింక్స్ తాగాలని చెబుతున్నారు. మరీ ఏఏ డ్రింక్స్ తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం టీ..
అల్లం టీ(Ginger tea) రోజూ తాగి రోజూ తాగితే ఇమ్మూనిటి పవర్(Immunity power) పెరుగుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు(Anti-inflammatory properties) పుష్కలంగా ఉంటాయి కాబట్టి.. అల్లాన్ని వాటర్ తో మరిగించి తాగినా హెల్త్‌కు మంచిదేనంటున్నారు నిపుణులు.
నిమ్మరసం..
నిమ్మరసం ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. నిమ్మరసం(lemon juice) అండ్ తేనె(honey) మిక్స్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి బోలెడు బెనిఫిట్స్ ఉంటాయి. నిమ్మలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేలా చేస్తుంది.
చికెన్ సూప్..
శీతాకాలంలో చికెన్ సూప్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. చలి దూరమవ్వడమే కాకుండ హెల్త్‌కు చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ సూప్ (Chicken soup)బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతేకాకుండా ముక్కు దిబ్బడకు చెక్ పెడుతుంది. కాగా చలికాలంలో ఈ చికెన్ సూప్ తాగి చూడండి.
ఉప్పు నీరు..
చలికాలంలో సాల్ట్ వాటర్(Salt water) నోట్లో పోసుకుని పుక్కిలిస్తే నోటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా నోట్లోని బ్యాక్టీరియా(Bacteria) క్లీన్ అవుతుంది. కాగా ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోండని తాజాగా నిపుణులు చెబుతున్నారు.